ఎన్నికల ఫలితాల జోష్లో స్టాక్ మార్కెట్లు లాభపడినా, రూపాయి పతనం ఆందోళన కలిగిస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 39 పైసలు తగ్గి, అత్యంత కనిష్ఠమైన రూ.95.23 వద్దకు చేరింది. అటు అంతర్జాతీయంగా ముడి చమురు ధర 5% పెరిగి 114 డాలర్లకు చేరడం కూడా సూచీలపై ప్రభావం చూపింది. ఈ రెండు ప్రతికూల అంశాల వల్ల మార్కెట్ సాధించాల్సిన భారీ లాభాలు కొంతమేర పరిమితమయ్యాయి.