దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని ఎన్డీయే గెలుచుకోవడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. మదుపర్ల నమ్మకం పెరగడంతో సెన్సెక్స్ 355 పాయింట్లు, నిఫ్టీ 121 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో BSE మార్కెట్ విలువ ఏకంగా రూ.3.95 లక్షల కోట్లు పెరిగింది. బ్లూచిప్ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.