TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా భూదాన్ భూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి ఫైట్ చేద్దామని పిలుపునిచ్చారు. బాధితులు వారికి జరిగిన అన్యాయాన్ని కేటీఆర్కు వివరించారు.