AP: ఆంధ్ర- ఒడిశా బోర్డర్లో భారీగా గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1800 కేజీల హాష్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. హాష్ ఆయిల్‌తో పాటు రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.