AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2026 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలు విడుదల చేయనున్నారు. పాలిసెట్‌కు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేయగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. ఫలితాలను polycetap.ap.gov.in, మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు.