నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ మూవీలోని ‘ఆయా షేర్’ సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్ ఏకంగా 9 దేశాల్లో యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. భారత్, UAEలలో అగ్రస్థానంలో ఉండగా.. US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ ట్రెండ్ అవుతోంది. పాటలోని ‘రా ఇంపాక్ట్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ గ్లోబల్ సెన్సేషన్‌గా మారింది.