ప్రస్తుత సమాజంలో రాజకీయ, పోలీస్, న్యాయవ్యవస్థ వంటి కీలక రంగాలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. వ్యవస్థలో కొందరు చేసే అవినీతి.. మొత్తం వృత్తికే మచ్చ తెస్తోంది. సమాజానికి అవగాహన పెంచాల్సిన జర్నలిజం కూడా ఈ వలలో చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు. వ్యక్తులు మారితేనే వ్యవస్థ మారుతుంది. అప్పుడే వృత్తులకు గౌరవం, సమాజానికి భద్రత లభిస్తాయి. మార్పులో మనమూ భాగస్వాములవడం చాలా ముఖ్యం.