బలమైన రోగనిరోధక శక్తి ఉంటే వైరస్లు, బ్యాక్టీరియాలు దరిచేరవు. ఇందుకోసం సి-విటమిన్ ఉండే నిమ్మ, కమల, విటమిన్-బి6 గల అరటి, చికెన్, శెనగలు తీసుకోవాలి. విటమిన్-ఎ కోసం క్యారెట్, గుమ్మడి, విటమిన్-ఇ కోసం నట్స్, బాదం అవసరం. ఎముకల పుష్టికి, రక్షణకు డి-విటమిన్ ఇచ్చే గుడ్లు, పాలు తీసుకుంటూ.. రోజూ ఎండలో 10-30 నిమిషాలు గడపాలి.