VKB: తాండూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ తీరుపై BRS నేత పటేల్ కరుణాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఇళ్లను ‘GMK ట్రస్ట్’ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా పంపిణీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కనీసం ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేకుండా ఇళ్ల పంపిణీ చేపట్టడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.