MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బాలసముద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్ను ఎత్తేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని కాలేజీలకు చెప్పడం సరికాదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.