సినీ నటుడు తారకరత్న (tarakaratna) భౌతికకాయనికి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లాలోని మోకిలలో ఇంటి వద్ద నివాసంలో అంజలి ఘటించారు.
తారకరత్న పెద్దలు అంటే ఎంతో గౌరవం అని, అందరితోనూ కలివిడిగా ఉండేవారు అని ప్రముఖ కమెడియన్ అలీ అన్నారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, తారకరత్నకు పెద్దలు అంటే ఎంతో గౌరవం అన్నారు. తన తమ్ముడితో కలిసి చదువుకున్నాడని గుర్తు చేసుకున్నారు. హీరో కాకముందు తన ఇంటికి రెగ్యులర్ గా వచ్చేవారు అన్నారు. ఒకేరోజు 9 సినిమాలు ప్రారంభించిన ఘనత ఆయన సొంతం అన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తారకరత్న తమతో చెప్పారని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. తారకరత్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెల 22 తో అతనికి 40 ఏళ్లు మాత్రమే పూర్తి అవుతాయని, మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం అన్నారు. సినిమా రంగంలో ఓకే రోజు 10 సినిమాలు ప్రారంభించిన ఘనత దక్కించుకున్నారు అని చెప్పారు. అమరావతి సినిమాలో నటనకు గానూ నందిని గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినట్లు చెప్పారు. తారకరత్న పిల్లలను చూస్తే బాధగా ఉందన్నారు.