NZB: ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్పర్సన్గా గోనె లహరి, వైస్ ఛైర్మన్గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మినరల్స్ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్నారు.