»28 Years China Girl Crying Because She Doesnt Have A Boyfriend
Viral News: బాయ్‌ఫ్రెండ్ లేడని ఏడ్చిన యువతి
ఎక్కువగా అబ్బాయిలు తమకు ప్రేమించడానికి సరైన అమ్మాయి దొరకడం లేదని ఆవేదన చెందిన సంఘటనలు విన్నాం. కానీ అమ్మాయిలు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ లేడని ఏడ్చిన సంఘటనలు విన్నారా? లేదా అయితే ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఈ సంఘటన చైనా షాంఘైలో జరిగింది.
ఓ మహిళ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. ఇందులో ఆ మహిళ తన కథ చెబుతూ కన్నీరుమున్నీరైంది. తన జీవితంలో ఇంతవరకూ బాయ్‌ఫ్రెండ్ లేడని ఆ మహిళ చెబుతోంది. ఆ మహిళ ఇక్కడితో ఆగలేదని, తన జీవితంలో ఏ అబ్బాయి చేయి కూడా పట్టుకోలేదని ఏడుస్తూ చెప్పింది. ఈ మహిళ సంఘటనపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.
పేరు తెలియని చైనా(china)లోని షాంఘై(shanghai)కు చెందిన 28 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 12న పోస్ట్ చేసిన వీడియోలో తెలిపింది. ఆమె తన ఉద్యోగం సహా ఒంటరిగా ఉండటం వల్ల తాను అనుభవిస్తున్న ఒత్తిళ్ల గురించి తన కోడలుతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్రమంలో తాను ఇప్పటి వరకు ఏ అబ్బాయి చేయి పట్టుకోలేదని. అందుకోసం చాలా విషయాలు ప్రయత్నించానని చెప్పింది. బ్లైండ్ డేట్‌కి వెళ్లాను కానీ ప్రేమ దొరకలేదని వీడియోలో మహిళ ఏడుస్తూ చెప్పింది.
అయినప్పటికీ తాను నిరాశ చెందలేదని వెల్లడించింది. తన తల్లిదండ్రుల(parents)ను నిరాశపరచలేనని తెలిపింది. మళ్లీ ప్రయత్నిస్తాని చెప్పుకొచ్చింది. తనకున్న పరిమితమైన డబ్బును బ్లైండ్ డేట్ల కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడట్లేదని ఆమె తెలిపింది. షాంఘై(shanghai)లో నివసిస్తున్న ఈ మహిళ తన ఒంటరి సంబంధం గురించి ఆమె తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పింది. ఈ వీడియో చూసిన పలువురు ఆమె కంటే నేను 2 సంవత్సరాలు పెద్దదానినని చెబుతూ దీన్ని అర్థం చేసుకోగలనని కామెంట్లు చేశారు. మరో మహిళ కూడా నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను… నా తల్లిదండ్రులు నాపై ఒత్తిడి తెస్తున్నారని కామెంట్(comment) చేసింది.
మరోవైపు ఇప్పటికే 2019లో రెండు చైనా(china)సంస్థలు(companies) తమ వద్ద పనిచేసే 30 ఏళ్లు దాటిన అవివాహిత మహిళలకు డేటింగ్(dating) కోసం 30 రోజుల అదనపు సెలవులను ప్రకటించాయి. యువతులు(young womens) ఎక్కువగా ఆఫీసు కార్యకలాపాల్లో ఉండటం, బయట ప్రపంచంతో ఎక్కువగా సంబంధాలు లేకపోవడంతోనే ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయని కొన్ని సంస్థలు చెబుతున్నాయి.