JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆలయ పరిసరాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రాంగణం, పార్కింగ్, ప్రవేశ ద్వారాలు, రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.