AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,980 మంది భక్తులు దర్శించుకోగా.. 26,511 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లుగా వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.