IPL చరిత్రలో కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. టోర్నీ చరిత్రలోనే 9000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచాడు. 275 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఈ మార్క్ అందుకున్నాడు. ఇందులో 66 హాఫ్ సెంచరీలు ఉండగా, ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.