KDP: లంచం తీసుకుంటూ పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ ఎస్.వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్సై దాసరి అనిల్ కుమార్లు బుధవారం జైలు పాలయ్యారు. ఈనెల 23న వారు రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. సీఐ, ఎస్సైలను బుధవారం కర్నూలులోని అనిశా కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
Tags :