ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా, రెండు జట్లు చెరో నాలుగు విజయాలను సాధించాయి. అయితే, ఇవాళ మ్యాచ్ జరగనున్న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో GTతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ CSK పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.