»Marijuana Gang Assaulted To Family In Visakhapatnam
Marijuana పరిపాలన రాజధాని విశాఖలో ఘోరం.. నడిరోడ్డుపై మహిళ బట్టలు చింపేసి
రిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గంజాయి (Marijuana) గుప్పుమంటోంటి. ఎక్కడ చూసినా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తాడేపల్లి (Tadepalli) ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఓ దుండగులు అంధురాలైన యువతిని కిరాతకంగా హత్య చేశాడు. ఆ సంఘటన మరచిపోక ముందే పరిపాలన రాజధాని అంటూ ప్రకటన చేస్తున్న విశాఖపట్టణం (Visakhapatnam)లో దారుణం జరిగింది. అక్కడ కూడా గంజాయి మత్తులో కొందరు ఓ కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. మహిళను వివస్త్ర చేసి క్రూరంగా (Assaulted) ప్రవర్తించారు. ఈ ఘటనతో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ గంజాయి అడ్డాగా మారిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానులు (Three Capitals) అని చెబుతున్నారు. ఆ మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ గంజాయి గుప్పు మంటోంది. విశాఖలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్టణంలోని పూర్ణామార్కెట్ (Poorna Market) దరి రంగిరీజు వీధిలో ఓ వ్యక్తి (33), తన భార్య (28), కుమార్తె (6)తో కలిసి నివసిస్తున్నాడు. భార్య పాపతో కలిసి బుధవారం రాత్రి ఆయన షాపింగ్ కు వెళ్లాడు. షాపింగ్ పూర్తి చేసుకుని రాత్రి 9.30 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో వీరిని కొందరు ఆకతాయిలు వీర్రాజు, సంపత్ ద్విచక్ర వాహనంపై వెంబడించారు. వీళ్లు అప్పటికే మద్యం, గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. హారన్ గట్టిగా కొడుతూ వెంటపడ్డారు. దీంతో ఆ వ్యక్తి వీరిని మందలించాడు. తమనే తిడతావా అంటూ ఆ యువకులు వీరి వాహనాన్ని అడ్డుకున్నారు.
వెంటనే ఓ దుండగుడు ‘నా ఏరియాలో నన్నే ఎదిరించి మాట్లాడతావా? నీ అంతు చూస్తా. నీ భార్యను రేప్ చేస్తా. ఎలా అడ్డుకుంటావో చూస్తాను’ అంటూ రెచ్చిపోయాడు. వెంటనే తన మిత్రులు నలుగురిని పిలిపించాడు. ఆ కుటుంబాన్ని మిత్రులు పట్టుకోగా మహిళతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వస్త్రాలు చించేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆ మహిళపై చేయి చేసుకున్నాడు. భర్త, ఆమె సోదరుడు అభిలాష్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. రక్తం కారేలా దారుణంగా కొట్టారు. ‘మీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించి ఆ దుండగులు పారిపోయారు. గాయాలపాలైన ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతూ వన్ టౌన్ (One Town) పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పరిపాలన రాజధానిగా కాబోతున్న విశాఖపట్టణంలో ఇలాంటి ఘటనలో గతంలో చాలానే జరిగాయి. జనవరి 6న సచివాలయ కన్వీనర్ పై కూడా గంజాయి మత్తులో కొందరు దాడులు చేశారు. ఒక రోజు పోలీస్ రక్షక్ వాహనంపై కూడా దాడి చేశారని తెలుస్తున్నది. విశాఖపట్టణంలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. బహిరంగంగానే వీటి విక్రయాలు సాగుతున్నాయి. ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా జరుగుతోంది. అడ్డుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.