MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో పిచ్చి కుక్కల దాడిలో గ్రామానికి చెందిన కొమ్ము ఎల్లయ్య అనే వృద్ధుడు మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామపంచాయతీ సిబ్బంది జాడి శ్రీరాజ్ (25), మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు స్పందించి పిచ్చికుక్కల బెడద నుండి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.