AP: ఏలూరు జిల్లాపై ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమగ్ర చర్చ జరిపినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. IVRS ద్వారా సర్వే చేసినట్లు తెలిపారు. సంతృప్తి, అసంతృప్తి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. పరిశ్రమల కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి, పాపికొండలు, లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి రోడ్లపై చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు.