»Cricketer Ambati Rayudu Land Donated For Kaleshwaram Project
Ambati Rayudu భూమి దానం ఇచ్చిన భారత క్రికెటర్ అంబటి రాయుడు
రైతుల మేలు కోరి తన భూమిలోని ఎకరంన్నర భూమిని (Agricultural Land) ప్రభుత్వానికి అప్పగించాడు. ప్రభుత్వం నిర్మించిన కాలువ కోసం అంబటి రాయుడు భూమిని ఉదారంగా (Donated) ఇచ్చాడు. తత్ఫలితంగా ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పొలాలకు సాగునీరు చేరుతున్నది. అంబటి రాయుడు చేసిన మేలుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభినందించారు.
భారత క్రికెటర్ (Indian Cricket Player) అంబటి రాయుడు (Ambati Rayudu) తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) భూమి దానమిచ్చాడు. రైతుల మేలు కోరి తన భూమిలోని ఎకరంన్నర భూమిని (Agricultural Land) ప్రభుత్వానికి అప్పగించాడు. ప్రభుత్వం నిర్మించిన కాలువ కోసం అంబటి రాయుడు భూమిని ఉదారంగా (Donated) ఇచ్చాడు. తత్ఫలితంగా ప్రస్తుతం సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పొలాలకు సాగునీరు చేరుతున్నది. అంబటి రాయుడు చేసిన మేలుపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ సందర్భంగా అంబటి రాయుడి గొప్పతనాన్ని సిద్ధిపేట (Siddipet) ప్రజలకు హరీశ్ రావు తెలిపారు. ఈ విషయాన్ని బహిరంగ వేదికలో హరీశ్ రావు (Harish Rao) చెప్పడంతో.. అసలు భూమి ఏమిటి? ఎప్పుడూ జరిగిందనేది అందరిలో ఆసక్తికర చర్చ మొదలైంది. అవేంటో తెలుసుకోండి.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం (Kaleshwaram) అని అందరికీ తెలిసిందే. ఈ కాళేశ్వరం ద్వారా దాదాపు ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ (Hyderabad) కూడా నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేటకు నీళ్లు అందించేందుకు కాలువలు తవ్వాల్సి వచ్చింది. అయితే సిద్ధిపేటలో క్రికెటర్ అంబటి రాయుడికి వ్యవసాయ క్షేత్రం (Farm House) ఉంది. కాలువ అతడి పొలంలో నుంచి వెళ్తుంది. దీంతో కాలువ కోసం భూమి ఇవ్వాలని అధికారులు కోరగా.. అంబటి రాయుడు సమ్మతించి తన ఎకరంన్నర భూమిని అప్పగించాడు. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. కానీ సిద్ధిపేటలో గురువారం నిర్వహించిన ‘సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్’లో హరీశ్ రావు వెల్లడించాడు. ఈ కార్యక్రమానికి నటుడు నాని (Nani), క్రికెటర్ అంబటి రాయుడు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘దేశ జనాభా 140 కోట్లు ఉంటే అందులో కేవలం 11 మంది మాత్రమే క్రికెట్ ఆడుతారు. అలాంటి 11 మందిలో మన తెలుగు బిడ్డ అంబటి రాయుడు ఉన్నాడు. సిద్ధిపేటలో అంబటి రాయుడికి మంచి సంబంధం ఉంది. సిద్దిపేట గల్లీల్లో తిరిగానని అంబటి నాకు చెప్పడంతో ఆశ్చర్యపోయా. కోమటి చెరువు, ఇంకా సిద్దిపేటలో కలియతిరిగాడని చెప్పాడు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అంబటి తన ఎకరంన్నర భూమి ఇచ్చాడు. సిద్ధిపేటలోనే అంబటి రాయుడికి వ్యవసాయ క్షేతం ఉంది. ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లతో వ్యవసాయం చేస్తున్నాడు’ అని తెలిపాడు.
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘పదేళ్లల్లో సిద్దిపేట చూశా. ఎన్నోసార్లు సిద్దిపేటకు వచ్చా కానీ ఇంత పెద్ద మొత్తంలో ప్రజలను కలవడం ఇదే మొదటిసారి. భారతదేశంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోంది. కేసీఆర్ కు నేను పెద్ద అభిమానిని. భారత క్రికెట్ జట్టులో తెలుగు వాళ్లు చాలామంది ఆడాలి. ఇక్కడ క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని మంత్రి హరీశ్ కోరారు. నేను ప్రయత్నిస్తా’ అని తెలిపాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించాడు. మంత్రి హరీశ్ రావు తనను కుటుంబసభ్యుడిలా ఆదరించారని తెలిపాడు.