TG: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లను ఇవాళ్టి నుంచి స్వీకరించనున్నారు. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. మార్చి 6న స్క్రూటినీ, 9న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 16న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న తెలంగాణ నుంచి అభిషేక్ సింఘ్వీ, సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి.