TG: సన్న వరి సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మే 4 నుంచి 9 వరకు ‘రైతు ఉత్సవాలు’ నిర్వహించనుంది. మే 15 నాటికి నాణ్యమైన విత్తనాలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కంపెనీలతో కూడా మాట్లాడి ప్రభుత్వం సూచించిన రకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. విత్తన ఎంపిక, సాగు మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.