ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించని వారిపై చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.