GNTR: తెనాలిలో వహాబ్ చౌక్ వద్ద స్థానికులు గతంలో జాతీయ జెండా ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాక రంగులతో ఉన్న ఆ స్తూపానికి మున్సిపల్ సిబ్బంది జనగణన ప్రచార ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండాను అవమానిస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే ఇలా చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.