వయనాడ్ ప్రజలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్కు ప్రియాంక గాంధీ కన్నా మెరుగైన ప్రతినిధి ఉంటుందని అనుకోవడం లేదన్నారు. పార్లమెంట్లో తనదైన శక్తివంతమైన గొంతును ప్రియాంక వినిపిస్తుందనే నమ్మకం ఉంది తెలిపారు. ఆమె వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నందున అందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.