ATP: రోద్దం మండలం చోలేమర్రి చెరువులో మంగళవారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల మేరకు బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. సమీప పొలాలకు వెళుతున్న రైతులు మృతదేహాన్ని గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని పూర్తి సమాచారం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు.