పడుకుని ఫోన్ చూడటం అందరికీ అలవాటుగా మారింది. దీంతో ఆరోగ్యానికి ఎంతో హానికరం. ముఖ్యంగా చీకటి గదిలో ఫోన్ చూస్తున్నప్పుడు స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నేరుగా కళ్ళపై పడి ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’కు దారితీస్తుంది. పడుకుని ఫోన్ వాడటం వల్ల మెడ ఎముకలపై ఒత్తిడి పెరిగి తీవ్రమైన మెడ, భుజాల నొప్పులు వస్తాయి. అందుకే నిద్రపోయే కనీసం 30 నిమిషాల ముందే ఫోన్ను దూరంగా ఉంచడం ఉత్తమం.