అంగన్వాడీ సిబ్బందికి వేసవి సెలవులు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గురువారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయచోటి ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పెండింగ్ వేతనాలు, ఇన్సెంటివ్స్, ఈవెంట్ సెంటర్ అద్దెలను వెంటనే చెల్లించాలని కోరారు.