MDK: హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లిలో పిడుగు పడి చింతల శ్రీను అనే రైతు మృతి చెందాడు. గురువారం సాయంత్రం బూరుగుపల్లి-వాడి రహదారిలోని పెట్రోల్ బంక్ సమీపంలో ధాన్యం ఆరబోసి కాపలాగా ఉండగా, అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.