TG: రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీసీ సంఘం నాయకులు కలిశారు. ఆయనను కలిసిన అనంతరం నాయకులు మాట్లాడారు. ‘విద్యార్థులతో మాట్లాడేందుకు మీకు సమయం లేదా? జీవో 29 ద్వారా బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోంది. జీవో 29 అనేది చీకటి జీవో.. దాన్ని రద్దు చేయాలి. భవిష్యత్తులో అగ్రవర్గాల వారే అన్ని చోట్లా అధికారులుగా ఉంటారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా పరీక్ష నిర్వహిస్తున్నారు’ అని అన్నారు.