జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ ఎన్నటికీ పాకిస్థాన్లో భాగం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని భారత్లోకి ఎగదోయడం ఆపేయాలని సూచించారు. ఢిల్లీతో మంచి సంబంధాలు కొనసాగాలంటే ఇలాంటి పనులు చేయొద్దని హితవు పలికారు.