TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. నాదెండ్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.