TG: MIM కీలక నేతలు ఓవైసీ బ్రదర్స్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి 15 నిమిషాలు ఇస్తే హిందువులు లేకుండా చేస్తాను అన్నారని గుర్తు చేశారు. వారికి 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు ఇచ్చినా ఏం చేయలేరని ఎద్దేవా చేశారు. కానీ, తమకు ఐదు నిమిషాలు ఇచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎక్కడకి రావాలో చెప్పు అని సవాల్ విసిరారు.