TPT: హైదరాబాద్కు చెందిన శివకోటి సిద్ధార్థ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళంగా చెక్కును అందజేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో దాత కుటుంబ సభ్యులను అభినందించారు.