TG: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీని మూసివేసే పరిస్థితి నుంచి లాభాల బాటలో నడిచేలా చేశామన్నారు. నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయని, అన్నింటికి సమ్మె పరిష్కారం కాదంటూ హితవు పలికారు. సమ్మెకు వెళ్లి పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పుకొచ్చారు.