W.G: నరసాపురం అగ్నిమాపక కేంద్రం ప్రాంగణంలో వారం రోజులుగా జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా అగ్నిమాపక శాఖ వినియోగించే అత్యాధునిక పరికరాలు, రెస్క్యూ సామాగ్రి, రెస్క్యూ బోటును ప్రజల సందర్శనార్థం ప్రదర్శించారు. వీటి పనితీరు, అత్యవసర సమయాల్లో వీటిని ఎలా ఉపయోగిస్తారనే విషయాలను ఫైర్ ఆఫీసర్ కె. భాస్కర్ వివరించారు.