దర్శకుడు హను రాఘవపూడి NTRను ‘సునామీ’ వంటి నటుడని కొనియాడాడు. ఆయనలో Sr. NTR గారి అన్ని లక్షణాలు ఉన్నాయని, పౌరాణికం నుంచి కామెడీ వరకు ఏ పాత్రనైనా చేయగలరని ప్రశంసించాడు. ఇప్పటివరకు సరైన కథ కుదరకపోవడం వల్లే తారక్‌తో సినిమా చేయలేకపోయానని, ఆయన స్థాయికి తగ్గ స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉందన్నాడు. వేటూరి కూడా తారక్ స్పష్టమైన ఉచ్చారణను మెచ్చుకునేవారని హను గుర్తుచేశాడు.