‘పాపం ప్రతాప్’ సక్సెస్ మీట్లో సీనియర్ నటి రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నిజం’ సినిమాలో తన నెగటివ్ పాత్రపై స్పందిస్తూ.. “నటిగా అన్ని షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నిజం మూవీలో నటించా. కానీ అది అంత నెగటివ్ అవుతుందని అనుకోలేదు. భవిష్యత్తులో ప్రేక్షకులు మెచ్చే పాత్రలే చేస్తాను. రోల్ పాజిటివా, నెగటివా అన్నది కాదు.. నాకు నచ్చితేనే నటిస్తా” అని తెలిపింది.