కడప నగరంలోని బిల్టప్ కూడలి వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామరాజుపల్లెకు చెందిన నాగూరు దస్తగిరమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. పోలేరమ్మ గుడి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దస్తగిరమ్మను 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.