తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు రాత్రి 7 గంటలకు మాడవీధుల్లో విశ్వక్సేనులవారు విహరించనున్నారు. ఈనెల 4న సా.5:45, 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. CM చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు పెద్ద శేషవాహనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు.