TG: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షనేతలు ప్రభుత్వ విధానంపై అనేక విమర్శలు చేస్తున్నారు. తాజాగా బక్క జడ్సన్ మూసీ ప్రక్షాళన విషయంలో బఫర్ జోన్లలో ఉన్న కట్టడాలను కూల్చేస్తున్న అంశంపై స్పందించారు. సచివాలయం, జీహెచ్ఎంసీ భవనాలు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నాయని, వాటిని కూడా హైడ్రా కూల్చేయాలని ఆ భవనాలపై RB-X గుర్తు వేశారు. వెంటనే వీటిని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు.