»More Than 2 Lakh Indians Have Renounced Their Citizenship In A 2022
citizenship: ఒకే ఏడాది 2 లక్షల మందికిపైగా పౌరసత్వం వదులుకున్న ఇండియన్స్
దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ప్రతి ఏడాది అనేక మంది భారతీయులు విదేశాలకు వెళ్లడం సహా పలు కారణాలతో ఇండియా పౌరసత్వం(citizenship) వదులుకుంటున్నారు. ఒక్క 2022లోనే 2,25,620 మంది తమ పౌరతస్వం వదులుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ (s jaishankar) ప్రకటించారు. గత 12 ఏళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు. ఇక 2021లో 1,63,370 మంది వారి పౌరసత్వం వదులుకున్నారు. పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య, వారు స్వీకరించిన దేశాల పౌరసత్వం గురించి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యే నరేన్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నకు జైశంకర్ గురువారం రాజ్యసభ(rajya sabha)లో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను అందించారు.
మరోవైపు 2011 నుంచి ఇప్పటివరకు 16 లక్షల 60 వేల మంది ఇండియన్స్(indians) తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ ((s jaishankar) తెలిపారు. 2011 నుంచి పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల గురించి సంవత్సరాల వారీగా గణాంకాలను ఇక్కడ చూడవచ్చు. 1,22,819 భారతీయులు 2011లో తమ పౌరసత్వాన్ని వదులుకోగా, 2012లో 120,923, 2013లో 1,31,405, 2014లో 1,29,328, 2015లో 1,31,489, 2016లో 1,41,603, 2017లో 1,33,049, 2020లో 85,256, 2021లో 1,63,370, 2022లో 2,25,620 మంది వారు తమ వదులుకున్నారు. వ్రాతపూర్వక సమాధానంలో భాగంగా మంత్రి జైశంకర్ భారతీయులు పౌరసత్వం (citizenship) పొందిన జాబితాలో 135 దేశాలు ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు మాత్రమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పౌరసత్వం పొందారని ఒక ప్రశ్నకు సమాధానంలో విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్(muralidharan) తెలిపారు. ఇంకోవైపు కొన్ని ఏళ్లుగా అమెరికా(USA)లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం అంశాన్ని కూడా పరిగణిస్తున్నామని అన్నారు. ఇప్పటికే అమెరికాలో అనేక మంది హెచ్1బీ, ఎల్1 వీసాలు తీసుకున్న భారతీయులు కూడా ఉన్నారని చెప్పారు. అంతేకాదు అమెరికా ప్రభుత్వం సహా అక్కడి వాణిజ్య సంస్థలు, ఇతర నేతలతో ఎప్పుటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నట్లు వెల్లడించారు.
కానీ గత నాలుగేళ్లలో విదేశాలలో(foreign countries) స్థిరపడిన వ్యాపారవేత్తలు, నిపుణుల సంఖ్యపై నిర్దిష్ట డేటా అందుబాటులో లేదని చెప్పారు. పౌరసత్వం పొందుతున్న వారిలో కొందరు తమ ఉద్యోగ కోసం, మరికొంత మంది వ్యక్తిగతంగా సహా అనేక కారణాలతో పౌరసత్వం పొందుతున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో పర్యాటకం(tourism) లేదా ఉపాధి(jobs) కోసం విదేశాలకు వెళ్లేందుకు భారతీయ పౌరులపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.
అయితే ప్రతి ఏటా లక్షల మంది విదేశాలకు వెళ్లినా కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు(indian economy) ఇబ్బంది ఏమి లేదని నిపుణులు అంటున్నారు. పైగా ప్రతి ఏటా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు, ప్రవాస భారతీయులు(NRI), విదేశీ పెట్టుబడులు(foreign investments) ఇలా అనేక అంశాలు ఇండియాకు అనుకూల అంశాలేనని అంటున్నారు. ఇలా ప్రతి ఏటా అనేక దేశాలకు వెళ్లే భారతీయుల కారణంగా ఇండియా((india)కు లాభమే కానీ నష్టమేమి లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు మాత్రం దేశంలో సరైన సౌకర్యాలు లేని కారణంగానే అనేక మంది భారతీయులు(indians) విదేశాలకు వెళుతున్నట్లు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చదువుల కోసం ఎక్కువగా విద్యార్థులు(students) విదేశాలకు వెళ్లిన అంశాలకు కూడా గుర్తు చేస్తున్నారు.