TG: లగ్జరీ వాచ్‌ల కుంభకోణంలో భాగంగా మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో మంత్రి కుమారుడు హర్షరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్‌లు వచ్చాయి. అలోకం నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఫహెర్దీన్ ముబీన్ నుంచి వాచ్‌లు కొనుగోలు చేశారు. విచారణలో అలోకం నవీన్ కుమార్ రూ.100కోట్ల స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.