SRCL: జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సులు, ఆటోలపై రవాణాశాఖ అధికారులు మంగళవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. డీటీవో లక్ష్మణ్ ఆదేశాల మేరకు వేములవాడ,ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట,చందుర్తి, రుద్రంగి, తంగళ్లపల్లి మండలాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని 15 వాహనాలను సీజ్ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఫిట్నెస్ లేని వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.