TG: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన కేంద్రమంత్రి అని మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారనేది అవాస్తవం అని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపిన ఘనత కాంగ్రెస్‌దే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతికి వ్యతిరేకం అని స్పష్టం చేశారు.