AP: వారం రోజులు గడిచినా పాలల్లో కల్తీ ఏ విధంగా జరిగిందో కూటమి ప్రభుత్వం గుర్తించలేకపోయిందని మాజీ హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. ఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడిందని తెలిపారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేదని చెప్పారు.