BDK: జిల్లాలో సెన్సస్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో డీసీవో భారతి హోళీకేరికి వివరాలు వెల్లడించారు. సెన్సస్ ప్రతి దశను సమయపాలనతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు.