SKLM: నేటి ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. రణస్థలం మండలం కోష్ట పంచాయతీలో ఉదయం 9 గంటలకు ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పాతర పల్లి గ్రామంలో 10:30 గంటలకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.